వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త..

 WhatsApp shopping button

మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బిజినెస్ వినియోగదారులకు  వ్యాపారాన్ని సులభతరం చేయడానికి షాపింగ్ బటన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బటన్ ద్వారా వినియోగదారులు షాపింగ్ చేసుకోవడం తోపాటు వస్తువులను జోడించడానికి, చెల్లింపు చేయడానికి మరియు వాట్సాప్‌లో తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిరోజులుగా ఈ ప్రయోగాత్మకంగా వాట్సాప్‌ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉంచింది. విజయవంతం కావడంతో  మంగళవారం నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్ ప్రకటించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్లకు క్యాటలాగ్‌ను జోడిస్తేనే సాధారణ కస్టమర్లు కూడా ఈ బటన్‌ను చూసి తద్వారా షాపింగ్ చేయడానికి వీలుంటుంది.