ఓ ఇంటివాడు కాబోతున్న వైవా హ‌ర్ష‌.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్.!

ఓ ఇంటివాడు కాబోతున్న వైవా హ‌ర్ష‌..

కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగవంటారు కదా పెద్దలు ఆ మాటాల‌ను నిజం చేస్తున్నారు తెలుగు సినీస్టార్స్.  క‌రోనా, లాక్‌డౌన్ అనే తేడా లేకుండా తమ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివారవుతున్నారు. తాజాగా ఈ  జాబితాలో యూట్యూబ్‌ స్టార్ వైవా హర్ష కూడా చేరబోతున్నాడు. తాజాగా హర్ష ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటీవల హర్ష తన సోషల్ మీడియాలో బ్యాచిలర్ గా ఇదే లాస్ట్ సెల్ఫీ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక తక్కువ టైం కే అక్షర అనే అమ్మాయితో హర్ష ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకి హర్ష బంధుమిత్రులు , స్నేహితులు, అలాగే సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇందుకు సంబంధించి న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హర్ష కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ది బెస్ట్ హర్ష అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దీంతో పలుగురు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా స్టార్లు, అభిమానులు వైరా హర్షకు విషేస్‌ తెలిపారు. ఇక పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు హర్ష. తన డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న వైవా హర్ష.... సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం కలర్‌ ఫోటోలో నటించిన విషయం తెలిసందే.. ఇందులో తనదైన శైలిలో కామెడీ పండించి అందరికి వినోదాన్ని పంచాడు.