పండంటి ఆడ బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విరుష్క జోడీ ‌

విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ సోమవారం మధ్యాహ్నం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. బేబీ రాకతో మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని కోహ్లీ ట్వీట్ చేశాడు.  మాకు కూతురు పుట్టిందని తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా భార్య అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలైంది.అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు కెప్టెన్ కోహ్లీ. విరాట్ తండ్రైన సందర్భంగా అభిమానులు, తోటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ సమయంలో మా ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామని కోహ్లీ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. కోహ్లీ తనకు కూతురు పుట్టిందని ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ట్విట్టర్‌లో ట్రైండ్ అయ్యింది.

 కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలాకాలం ప్రేమలో ఉన్న విరుష్క జోడీ 2017లో ఇటలీలో తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కిస్తూ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో అనుష్క ఆడబిడ్డకు జన్మనించింది. ఈ సందర్భంగా భారత క్రికెటర్ల, బాలీవుడ్ తారలు అనేక మంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.