ముస్లిం మత ప్రచారకుడికి 1075 ఏళ్ల జైలు శిక్ష !

ముస్లిం మత ప్రచారకుడికి 1075 ఏళ్ల జైలు శిక్ష !

టర్కీకి చెందిన ఓ మత ప్రబోధకుడికి అక్కడి న్యాయస్థానం సంచ‌ల‌న తీర్పునిచ్చింది. అంద‌రూ నిర్ఘాంతపోయేలా 1075 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు విన్న ఇస్లాం మత ప్రచారకుడు షాక్ కు లోనయ్యాడు.మైనర్లపై లైంగిక దాడులు, మహిళలకు లైగింక వేధింపులు, గూఢచర్యం వంటి నేరాలకు పాల్పడినందుకు గాను అద్నన్ ఒక్తార్ అనే మత ప్రాచారుకుడికి కోర్టు శిక్ష విధించింది. ముస్లిం మత ప్రచారకుడు అద్నన్ ఓఖ్తర్ టర్కీలో ఒక టీవీ ఛానల్ ను నిర్వహిస్తూ అందులో నిత్యం ప్రవచనాలు చెప్పేవాడు. ఆయన ప్రసంగించే సమయంలో మహిళలు చుట్టు పక్కల నిల్చుని డ్యాన్స్ లు చేసేవారు. 2018లో ఆయను పలు నేరాలపై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణ సందర్భంగా అద్నన్ వ్యాఖ్యలకు న్యాయమూర్తిలే షాకైపోయారు. తనకు వెయ్యికిపైగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారందరినీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వారిని పిల్లి పిల్లలుగా ముద్దుగా పిలుచుకుంటానని ఒక్త‌ర్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న జడ్జీలు నిర్ఘాంతపోయారు.