క్ష‌మాప‌ణ‌లు కోరిన ఆసీస్ కెప్టెన్‌.. 

క్ష‌మాప‌ణ‌లు కోరిన ఆసీస్ కెప్టెన్‌.. 

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య ఉత్కంఠ‌గా జరిగిన‌ మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆసీస్‌ 407 పరుగులు చేసింది. ల‌‌క్ష్యఛేద‌న‌కు బరిలో దిగిన భార‌త్.. ఆది నుంచి ఫేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌నను కన‌బ‌రించింది. టీమిండియా వ‌రుస‌గా వికెట్లు సమర్పించడంతో కంగారులకు ఇంకా సులువుగా మారింది.  ఓటమి అంచుల ఉన్న టీమిండియాను  హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆదుకున్నారు. వికెట్లు ప‌డిపోకుండా ఆట‌ను సాగించారు. వీరిని పెవిలియ‌న్‌కు పంపి గెలుపును కైవ‌సం కేసుకుంది. 
 
ఈ  పోరాటాన్ని జీర్ణం చేసుకోలేని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్‌..  పదే పదే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్- విహారీల వికెట్ ఎలా తీయాలో తెలియక.. అశ్విన్‌పై నోరు పారేసుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మాత్రం త‌న త‌ప్పు తెలుసుకొని క్ష‌మాప‌ణ చెప్పాడు. నేనో మ‌నిషిని, నేను చేసిన త‌ప్పుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అనుకుంటున్నాను. 

ఈ టీమ్‌ను లీడ్ చేయ‌డాన్ని నేను ఎప్పుడూ గ‌ర్వంగా ఫీల‌వుతాను. కానీ ఒత్తిడిని అధిగ‌మించ‌లేపోయాను అని పేన్ అన్నాడు. ఐదో రోజు ఆట ముగిసిన త‌ర్వాత కూడా అశ్విన్‌తో తాను మాట్లాడిన‌ట్లు తెలిపాడు. నేనో ఫూల్‌గా వ్య‌వ‌హ‌రించాను క‌దా అని అశ్విన్‌తో తాను అన్న‌ట్లు చెప్పాడు. ఇక ఇప్ప‌టికే అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేసినందుకు అత‌నికి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.