
టిక్ టాక్ లవర్స్ గుడ్ న్యూస్. టిక్‌టాక్ కూడా త్వరలో అడుగు పెట్టేందుకు సమాయత్తవుతోంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. అందులో పలు కీలక విషయాలను తెలిపినట్టు సమాచారం. సమాచారం భద్రతకు భంగం వాటిల్లుతుందనే కారణంతో భారత్ ఈ యాప్‌ను భారత్ నిషేధించింది.
"భారత ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలను అందజేశాం. డేటా గోప్యత, భద్రతతోపాటు స్థానిక చట్టాలను పాటించడానికి బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్ కట్టుబడుతుంది. భారత్‌లో టిక్‌టాక్‌కు దీర్ఘకాలికంగా అపారమైన వృద్ధి అవకాశాలు కల్పిస్తాం, ఇంకా ఏమైనా వివరాలను కావాలన్న అందిస్తాం. మనమందరం కలిసి యూజర్లకు, క్రియేటర్లకు మన ప్లాట్‌ఫాం ద్వారా మంచి గుర్తింపును ఇద్దాం." అని టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత నాలుగు నెలల కింద టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన వుయ్ చాట్, యూసీ బ్రౌజర్, పబ్జీ ఇంకా 117 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పబ్జి మొబైల్ గేమ్‌ను మళ్లీ భారత్‌లో పబ్జి మొబైల్ ఇండియా పేరిట లాంచ్ చేయనున్నట్లు పబ్జి కార్ప్ ఇటీవలే వెల్లడించిన విషయం విదితమే. ఆ కంపెనీ వారు ఆ ప్రకటన చేయడంతో అటు టిక్‌టాక్ లోనూ ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.