
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇలయదళపతి నటించిన 'మాస్టర్' సినిమా ఈ నెల 13న పెద్ద ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచి ప్రేక్షకులకు కన్నువిందు చేయనున్నది. కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో విడుదల కాబోతున్న భారీ చిత్రం 'మాస్టర్' కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా మాస్టర్ సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు పైరసీ బారిన పడింది. మాస్టర్ సినిమా ఆన్లైన్లో లీకైంది. రేపు విడుదల కానున్న తరుణంలో సినిమా పైరసీకి గురి కావడంతో తమిళ సినీ పరిశ్రమ షాక్కు గురైంది.
ఈ తరుణంలో సినిమా పైరసీపై 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎమోషనల్ స్పందించారు. ఏడాదిన్నర కష్టాన్ని నాశనం చేయొద్దంటూ వేడుకున్నారు. సినిమాను థియేటర్స్లో చూసి సంతోషిస్తారని ఆశిస్తున్నని అన్నారు. ఎవరి దగ్గరైన మాస్టర్ సినిమాకు సంబంధించిన లీక్ వీడియోలు ఉంటే దయచేసి షేర్ చేయోద్దని కోరుకుంటున్నారు. చేతులెత్తి వేడుకుంటున్నాని అన్నారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు #WeStandWithMaster హ్యాష్ ట్యాగ్ తో మాస్టర్ కు మద్దతుగా నిలుస్తున్నారు.