శ్రీ స్వామి హర్షానంద మహారాజ్ ఇక‌లేరు

శ్రీ స్వామి హర్షానంద మహారాజ్ ఇక‌లేరు

 బెంగళూరు నగరంలోని రామకృష్ణ మఠం అధిపతి స్వామి హర్షానంద మహారాజ్ మంగళవారం తుదిశ్వాస వీడిచారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో మరణించారు. ఈ మేర‌కు ఆశ్రమ అధికారులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స్వామి హర్షానంద మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సమస్యలపై స్వామికున్న జ్ఞానం,కరుణ స్వభావం మర్చిపోలేమని మోదీ  పేర్కొన్నారు.  బెంగళూరులోని బసవనగుడిలోని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి హర్షానంద మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం అవిరామంగా పనిచేశారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హర్షానంద మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.