దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక పరాజయం.. క్లీన్‌స్వీప్..‌

south-africa-beat-sri-lanka-10-wickets-test-series-clean-sweep

శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ లో దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగిసింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 67 పరుగుల కొద్దిపాటి లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా జట్టు వికెట్‌ నష్టపోకుండానే 13.2 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు మార్క్‌రమ్‌ (36 నాటౌట్‌; 4 ఫోర్లు), ఎల్గర్‌ (31 నాటౌట్‌; 5 ఫోర్లు) స్కోర్లతో జట్టుకు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఎల్గర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులను సొంతంచేసుకున్నాడు.

కాగా ఈ సిరీస్‌లో ఎల్గర్ మొత్తం నాలుగు ఇన్నింగ్స్ లలో‌ 253 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 150/4తో మూడో రోజైన మంగళవారం ఆటను ఆరంభించిన శ్రీలంక 56.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 66 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. ఇక తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.