కోలుకున్న దాదా.. జ‌న‌వ‌రి 6న డిశ్చార్జ్ ! మ‌రోవైపు ప్ర‌ధాని ఆరా..

కోలుకున్న దాదా.. జ‌న‌వ‌రి 6న డిశ్చార్జ్ ! మ‌రోవైపు ప్ర‌ధాని ఆరా..

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గంగూలీ స్వల్ప గుండెపోటుతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరిన విష‌యం తెలిసిందే.  దాదా గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోవడంతో స్టెంట్‌ ను పంపి వైద్యులు క్లియర్‌ చేశారు. గంగూలీకి తదుపరి చికిత్సపై తమ వైద్యులు నిర్ణయం తీసుకుంటారని.. పరిస్థితిని బట్టి మళ్లీ యాంజియోప్లాస్టి నిర్వహించాలా అన్న విషయంపై నిర్ణయానికి వస్తారని తెలిపింది. ప్ర‌స్తుత్తం ఆయ‌న ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

డాక్టర్‌ దేవిశెట్టి మంగళవారం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం వైద్య బృందంతో సమావేశంలో దాదాకు అందించే తదుపరి చికిత్స, డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే  ఆయ‌న ప్ర‌త్యేక వైద్య బృందం ప‌రీక్షిస్తూ గంగూలీ కుటుంబ సభ్యులతో చర్చించింది.
ఈ క్ర‌మంలో .. సౌరవ్‌ గంగూలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.