నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యస్థితి

sourav-ganguly-health-condition-stable-after-angioplasty-corona-report-negative

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. దాంతో గంగూలీని దక్షిణ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా.. ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు వైద్యులు. ఇది విజయవంతమైందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. సౌరవ్ గంగూలీకి కరోనా పరీక్షలు కూడా చేశారు.. నివేదిక కూడా ప్రతికూలంగా వచ్చింది. కాగా శనివారం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, సౌరవ్ ఒక్కాసారిగా కిందపడిపోయారు.. అనంతరం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.