సైనాకు కరోనా.. థాయ్ టోర్నీకి దూరం

 సైనాకు కరోనా.. థాయ్ టోర్నీకి దూరం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మరోసారి కరోనా బారిన పడ్డారు. థాయ్‌లాండ్ ఓపెన్ టోర్న‌మెంట్ లో పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లింది. టోర్న‌మెంట్ నియ‌మాల ప్ర‌కారం  సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించారు. దాని ఫలితాలు ఈ రోజు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడంతో క్రీడాభిమానులను షాక్‌కు గురయ్యారు. దీంతో ఆమె థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకొన్నారు. 

బ్యాంకాక్‌లో ఉన్న సైనాకు సోమవారం మూడోసారి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెతోపాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కి కూడా కరోనా సోకింది. దీంతో వీరిద్దరినీ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిర్వాహకులు సూచించారు. కొద్ది వారాల క్రితం సైనాతో పాటు ఆమె భర్త కశ్యప్‌కు కూడా కరోనా సోకగా.. వీరిద్దరూ కొన్ని రోజులు ప్రాక్టీస్‌కు దూరమయ్యారు. డిసెంబర్‌ 27న వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కశ్యప్‌ తెలిపారు.  ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె... తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ మ‌ళ్లీ క‌రోనా అని తెల‌డంతో మ‌ళ్లీ టోర్నీ దూరమైంది.