రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆయన భార్య కోరుకుంటున్నారా..? ఆడియో టేప్ సంచ‌ల‌నం!

 రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆయన భార్య కోరుకుంటున్నారా..? ఆడియో టేప్ సంచ‌ల‌నం!

ఎన్నోరోజులుగా రాజ‌కీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ ఊరించి ఊరించి.. ర‌జినీకాంత్. త‌న‌ అభిమానులకు షాక్ ఇస్తూ.. తాను ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వ‌బోన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఆరోగ్యకారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాను. మరో నిర్ణయం ఉండదని తేల్చి చెప్పాడు. కానీ త‌లైవా ప్రకటనను జీర్ణించుకోలేకపోని అభిమానులు.. ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినదించారు.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. 

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి లత రజనీకాంత్‌ పరోక్షంగా సాయం చేశారంటూ.. అభిమాన సంఘం నిర్వాహకుడు ఓ ఆడియో విడుదల చేశారు.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.  స్థానిక తిరువాన్మియూర్‌ రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌ మంగళవారం విడుదల చేసిన ఆడియోలో, రజనీ రాజకీయపార్టీ స్థాపిస్తారని గట్టి నమ్మకంతో ఎదురుచూశామని, అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం అభిమానులను నిరాశకు గురిచేసిందన్నారు.  

నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం సమీపంలో భారీస్థాయిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి అవసరమైన వేదిక, 500 వాటర్‌ క్యాన్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు తదితర సహాయాలను రజనీకాంత్‌ సతీమణి లత పరోక్షంగా అందించారని, ఆమె అసిస్టెంట్  కూడా వీటిని పరిశీలించి వెళ్లారని భాస్కర్‌ తన ఆడియోలో వ్యాఖ్యానించారు. భాస్కర్.. ఇప్పుడు ఇది తమిళనాడు పొలిటికల్ సర్కిల్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోనూ చర్చగా మారింది.. ఓవైపు ఇక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తే.. ఆయన పొలిటికల్ ఎంట్రీ చేయాల్సిందేనంటూ అభిమానులు నిర్వహిచిన ఆందోళనకు లత రజనీకాంత్ సహాయం చేయడం ఏంటి? అనే చర్చ సాగుతోంది.