పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్‌తో సెట్స్ పైకి ..

పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రిష్‌తో సెట్స్ పైకి ..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు గుడ్ న్యూస్. అతి త‌ర్వ‌లో ప్రముఖ దర్శకుడు క్రిష్  పవన్  సినిమా  అప్ డేట్స్ వ‌చ్చేసింది.  'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన.. వరుస సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ కావడంతో తర్వాత పవన్ ఏ సినిమా పూర్తి చేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా క్రిష్‌తో చేయబోతున్న సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేస్తూ అభిమానులను ఖుషీ చేశారు పవన్.

ఈ మూవీ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతుంది. ఇప్పటికే చిత్రీకరణ జరుపుకోవాల్సిన ఈ సినిమా డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా సోకడంతో వాయిదా పడింది. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు క్రిష్‌ సోషల్‌ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ మూవీ సోమవారం సెట్స్‌పైకి వచ్చిందని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌‌గా ట్వీట్ చేసింది. ఈ మేరకు షూటింగ్‌ లొకేషన్‌ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఏడాది మే నెల వరకు షూటింగ్‌ మొత్తం పూర్తి చేసేలా పవన్- క్రిష్ ప్లాన్ చేశారట.