పిచ్చిగా పిచ్చిగా మాట్లాడొద్దు.. బ‌ండి సంజయ్‌కు రిక్వెస్ట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి

పిచ్చిగా పిచ్చిగా మాట్లాడొద్దు.. బ‌ండి సంజ‌య్‌ని రిక్వెస్ట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజల్ని రెచ్చగొట్టొద్దని బండి సంజయ్ కి  సూచించారు.  భాగ్యలక్ష్మి, భద్రకాళి దేవాలయాల్లో కాదు అధికారికంగానే అభివృద్ధిని తేల్చుకుందాం అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ కు సాఫ్ట్ గా రిక్వెస్ట్ చేశారు మంత్రి ఎర్రబెల్లి . బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదన్నారు.

జనగామ జిల్లాలో మంగళవారం నాడు బీజేపీ నేతలపై అక్కడి పోలీసులు లాఠీ చార్జి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. 24 గంటల్లో సదరు పోలీసుల అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేదంటే జనగామలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు బీజేపీ నేతలను నిలువరించారు. మరోవైపు బండి సంజయ్ కూడా వారిని శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.