ఎల్‌ఐసీ బంపరాఫర్...రోజుకు రూ. 40 కడితే చాలు మీ అకౌంట్‌లోకి పాతిక లక్షలు వస్తాయి..!

LIC

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐఈసీ అధిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా  ఎల్ఐసీ పట్ల  ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేకపోవడానికి కారణం..ఆ సంస్థ అమలు చేస్తున్న వివిధ పాలసీలే కారణం. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం కల్పించడంతోపాటు...ఎల్‌ఐసీపీలో ఇన్స్యూరెన్స్ చేస్తే తమ డబ్బులు ఎక్కడకు పోవని నమ్మకం ఉండడమే..ఎల్‌ఐసీ కస్టమర్లకు అందిస్తున్న రకరకాల ప్లాన్‌లో ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ కూడా ఒకటి. తాజాగా ఈ స్కీమ్‌లో భారీ మార్పులు చేసి కొత్తగా కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ప్రకారం నెలకు రూ. 40 కడితే చాటు ప్రీమియం ముగిసేనాటికి ఏకంగా పాతిక లక్షలు పాలసీదారుల అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.

కాగా 18 నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వారు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చని ఎల్‌ఐసీ యాజమాన్యం తెలిపింది. అంతే కాదు ఈ పాలసీని 15 నుంచి 35 ఏళ్ల కాల పరిమితితో తీసుకోవచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులోనే ఈ పాలసీ తీసుకుంటే 35 ఏళ్ల ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.  18 ఏళ్ల సమయంలో  రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.1,150 ప్రీమియం పడుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.40 ఆదా చేయాలి. 35 ఏళ్ల పాలసీ టర్మ్ ముగియగానే బీమా మొత్తంతోపాటు బోనస్, అడిషనల్ బోనస్ లభిస్తుంది. మొత్తంగా పాలసీదారుడి చేతికి దాదాపు  రూ.25 లక్షలు వస్తాయి. అలాగే  రూ.5 లక్షల బీమా కవరేజ్ కొనసాగుతూనే వస్తోంది. ఈ బెనిఫిట్ కూడా లెక్కలోకి తీసుకుంటే..ఎల్‌ఐసీ అందిస్తున్న ఈ న్యూ జీవన్ ఆనంద్  పాలసీతో రమారమి  రూ.30 లక్షలు ప్రయోజనం లభిస్తుంది. ఎల్‌ఐసీ అందిస్తున్న ఈ న్యూజీవన్ ఆనంద్ పాలసీకి ఖాతాదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.