స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్న‌ట్టు..!  సునీతపై క‌త్తి సంచలన వ్యాఖ్యలు  

స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్న‌ట్టు..  సునీతపై క‌త్తి సంచలన వ్యాఖ్యలు  

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి ఘనంగా జరిగింది. ప్ర‌ముఖ మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో  ఈ నెల‌ 9న ఆయనతో కలిసి ఏడడుగులు వేసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయంలో సునీత, రామ్ వీరపనేని వివాహ వేడుకలు జరిగాయి. అమ్మపల్లి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత పెళ్లి జరిగింది. పెద్ద ఎత్తున వివాహ వేడుకలకు ప్రముఖులు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రామ్ వీరపనేనితో సన్నిహితంగా ఉండే పలువరు రాజకీయ నాయకులు ఈ పెళ్లిలో సందడి చేసారు.  అయితే ఇటీవల సునీత రెండో వివాహంపై క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

సునీత కళ్ళలో ఆనందం ఏంటి. ఆ ఆనందాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే. ఎవరీకీ తెలీకుండా చాటుగా చేసుకుంటారు. బయటకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ సునీత మాత్రం అలా కాకుండా రెండో పెళ్లి చేసుకుంటూ కూడా ఆ ఆనందం ఏంటి? ఇలా చేస్తూ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమాజం నాశనం అయిపోదా?’ అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి.