తెలుగువారికి ప్ర‌ధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు!

తెలుగువారికి ప్ర‌ధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటలు వేసి సంక్రాంతికి స్వాగతం పలికిన తెలుగువారు పండుగ హడావిడి లో బిజీగా ఉన్నారు. పండుగ  వేళ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్ర ప్రజలకుసోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు ప్రజలందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా హిందువులు  వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలను తమతమ సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ అని అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు లోగిళ్ళు. అవును భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా తెలుగు రాష్ట్ర ప్రజలు మూడురోజుల పాటు.. తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పండుగ శోభ మొదలైంది. పట్టణ ప్రజలు పల్లెల బాట పట్టారు. పల్లెల్లో పండుగ సందడి ఓ రేంజ్ లో కొనసాగవుతుంది.