వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడాలంటే ఇలా చేయాలి..!

whatsapp status

స్మార్ట్ ఫోన్లు వచ్చాకా..వాట్సాప్‌ ఇప్పుడు మనందరి జీవితంలో భాగమై పోయింది. ముఖ్యంగా యూత్ పొద్దున లేస్తే వాట్సాప్ ఛాటింగ్‌లు లేదా..వారికి నచ్చిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేస్తు ఉంటారు. ఆ తర్వాత ఆ స్టేటస్‌ను ఎంత మంది చూసారో కూడా పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వాట్సాప్ కస్టమర్ల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మన వాట్సాప్ స్టేటస్‌ను ఇతరులు చూస్తూ ఉంటారు...కాని ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను చిన్న ట్రిక్ ద్వారా సీక్రెట్‌గా చూడవచ్చు. మీరు ఫలానా వ్యక్తి వాట్సాప్ స్టేటస్ చూసినట్లు కూడా అతడికి తెలియదు.. ఇంతకీ ఎలా చూడాలంటారా... ముందుగా మీ వాట్సప్ ని ఓపెన్ చేసాక  సెట్టింగులకు వెళ్ళండి. అక్కడ మీకు అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి. అందులో మీకు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది.. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రీడ్‌ రిసిప్ట్‌ ఆన్ చేసి ఉంటె ఆఫ్ చేయండి. మీరు కనుక  ఆ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే మీరు ఫలానా వ్యక్తి  స్టేటస్‌ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు.

సో..రీడ్ రిసిప్ట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా  అవతలి వ్యక్తి స్టేటస్‌ చూసినవారి లిస్ట్‌లో మీ పేరు రాకుండా చేయొచ్చు. దీని ద్వారా మీరు మీ మిత్రులు పంపిన పోస్టులు చదివినా కూడా వారికీ కనిపించదు. అయితే ఇక్కడ మీకు చిన్న సమస్య కూడా ఉంది. రీడ్‌ రిసిప్ట్ ఆఫ్ చేయడం ద్వారా మీ స్టేటస్‌లు‌ ఎవరెవరు చూశారనేది కూడా మీకు తెలియదు. సో...ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌గా చూడాలంటే..ట్రిక్ ఏంటో తెలుసుకున్నారుగా...అయితే అలా చేయడం వలన మీ స్టేటస్‌లు ఎవరెవరు చూశారో కూడా తెలియదు...దానికి మీరు సిద్ధమైతే ఇలా ఇతరుల స్టేటస్‌లను సీక్రెట్‌గా ఈ చిన్న ట్రిక్ పాటించి చూసేయండి.