
వ్యాపారవేత్త రామ్ వీరపనేని, టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీతల పెళ్లి వివాహ వేడుక ఘనంగా జరిగింది. శనివారం ఈ వేడుక హిందూ సంప్రదాయాల ప్రకారం శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో జరిగింది. ఈ వివాహానికి ఇరుకుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, మరికొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో నితిన్ భార్య శాలిని వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా.. సునీత, రామ్లు ఇద్దరికి కూడా ఇది రెండో వివాహం. సునీతకు 19 ఏళ్ళ వయస్సులోనే ఆమె తల్లిదండ్రులు వివాహం చేయగా.. తర్వాత కొద్దిరోజులకు భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే