కేంద్రం ఇవ్వ‌కున్నా.. మేం ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తాం: కేజ్రీవాల్ 

కేంద్రం ఇవ్వ‌కున్నా.. మేం ఫ్రీగానే వ్యాక్సిన్ అందిస్తాం: కేజ్రీవాల్ 

కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వాసులంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని శుభ‌వార్త చెప్పాడు. కేంద్ర ప్ర‌భుత్వం జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. టీకాకు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ టీకా అందించా లంటే ఉచితంగా పంపిణీ చేయాలని అభ్యర్థించినట్టు వివరించారు.

అయితే, ఢిల్లీ వాసులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీకి  చేయ‌కుంటే..  వారికి ఆప్ ప్రభుత్వమే అందిస్తుందని హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సి ఉన్నదని అన్నారు. కరోనా టీకాను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వ్యాక్సిన్‌పై అపోహలకు పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పుకార్లు, వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఇప్పటికే వివిధ నగరాలకు వ్యాక్సిన్ చేరుకుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వారియర్ల కు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తుండటంతో పరిమిత సంఖ్యలో ఒక్కో రాష్ట్రానికి వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం.