ఆల‌యాల‌పై దాడి చేస్తే ఊరుకోం.. కుల, మతాలకు అతీతంగా చర్యలు:  డీజీపీ..

ఆల‌యాల‌పై దాడి చేస్తే ఊరుకోం.. కుల, మతాలకు అతీతంగా చర్యలు:  డీజీపీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్పటిదాకా దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామని తెలిపారు. అస‌త్య ప్ర‌చారాలు కొన్నిసార్లు సమస్యాత్మకంగా మారుతున్నాయన్నారు.  కుల, మత, రాజకీయాలకు అతీతంగా పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ.. కొందరు అదే పనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు.  పోలీసులకు కులం, మతం ఆపాదించడం సరికాద‌న్నారు. 

త‌న కేరీర్‌లో ఇలాంటి ఆరోపణలు వినలేదని, దేశసమగ్రతను కాపాడటంలో పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 58,871 హిందూ దేవాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, రాష్ట్రంలో కొత్తగా 14,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రామతీర్థం ప్రధాన ఆలయంలోని విగ్రహం ధ్వంసం కాలేదని, గుట్టపై ఉన్న విగ్రహాన్నే ధ్వంసం చేశారని డీజీపీ తెలిపారు. అంతర్వేది ఘటన తర్వాత నుంచి పోలీసులు భిన్నమైన ఛాలెంజ్‌ను ఎదుర్కున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.