బుల్లితెర‌ క్వీన్ యాంకర్ అన‌సూయ‌కు క‌రోనా! 

బుల్లితెర‌ క్వీన్ యాంకర్ అన‌సూయ‌కు క‌రోనా! 

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌విష‌యం తెలిసిందే.  క‌రోనా వ‌చ్చి ఏడాది కావొస్తున్నా.. దాని జోరు త‌గ్గ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారి దాటికి ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చి సంవత్సరం కావొస్తున్నా.. ఈ మహమ్మారి జోరు తగ్గడం లేదు. ఇక సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్‌, నటి అనసూయ ఇంట్లో కరోనా కలకం రేపింది. తనకు కరోనా లక్షణాలు ఉన్నట్టు స్వయంగా అనసూయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ఈ రోజు ఉదయం కర్నూలుకు శుభ‌కార్య నిమిత్తం బ‌య‌లు దేరుతున్న స‌మ‌యంలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో  ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నార‌ట‌. అనంత‌రం   తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటామని చెప్పింది. అలాగే గత కొన్నిరోజులుగా తనకు కలిసివాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. దీంతో అనసూయ కరోనా పరీక్షల్లో ఏం తేలుతుందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.