397 ఏండ్ల త‌రువాత ఆకాశంలో అద్భుతం ..

397 ఏండ్ల త‌రువాత ఆకాశంలో అద్భుతం ..

ఈ నెల 21న ఆకాశంలో అరుదైన దృశ్యం క‌నిపించ‌నున్న‌ది. అలాంటి అరుదైన దృశ్యం ఇప్పట్లో మళ్లీ రాదు. అందుకే... ఆ అరుదైన దృశ్యాన్ని తప్పక చూడాల‌ని ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఉన్నారు. అస‌లు ఆ రోజు ఏం జ‌రుగుతుంది? సౌర కుటుంబంలోని గ్ర‌హాలైన  గురు, శని గ్రహాలు ఒకదానికొకటి ద‌గ్గ‌రికి రానున్నాయి. ఇవి రెండూ గ్ర‌హాలు కలిపి ఆకాశంలో ఓ నక్షత్రంలా కనిపించనున్నాయి. ఇలాంటి అద్భుతం  ఘ‌టం చివరిసారి 1623లో జ‌రిగింది. అంటే దాదాపు 397 ఏళ్ల తర్వాత మరోసారి ఆ అద్భుతం ఆవిష్కృతం కానున్న‌దని బిర్లా ప్లానెటేరియం డైరెక్టర్ దేబి ప్రసాద్ దువారీ చెప్పారు.
 
 ఓ అరుదైన ఖగోళ వింత ఈ నెల 21న కనిపించనుంది. దీనిని ఓ గ్రేట్ కంజంక్షన్‌గా పిలుస్తారని తెలిపారు. ఏవైనా రెండు ఖగోళ రాశులు భూమి నుంచి చూసినప్పుడు రెండూ అత్యంత సమీపంగా కనిపిస్తే దానిని కంజంక్షన్ అంటారని, ఇదే గురు, శని గ్రహాల విషయంలో గ్రేట్ కంజంక్షన్ అంటారని ఆయన చెప్పారు.  అద్భుత ఘటం మళ్లీ మార్చి 15, 2080లో ఏర్పాడ‌నున్న‌ది.  డిసెంబర్ 21న రాత్రి ఈ రెండు గ్ర‌హాలు  అత్యంత స‌మీపంగా రానున్నాయి. కేవ‌లం వీటి మ‌ధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లుగా ఉంటుందని దేబి ప్రసాద్ తెలిపారు. ఆ రోజు సూర్యస్తమయం తర్వాత ఇండియాలోని చాలా నగరాల్లో ఈ కంజంక్షన్ కనిపిస్తుందని చెప్పారు.